గూగుల్‌ ఫొటోస్‌

ABN , First Publish Date - 2021-05-29T08:33:46+05:30 IST

గూగుల్‌ కొత్త స్టోరేజ్‌ పాలసీ జూన్‌ 1 నుంచి అమలుకానుంది. ఇక నుంచి ఫొటోలు, డాక్యుమెంట్లు సహా వేటినైనా 15 జీబీ మేరకు మాత్రమే స్టోర్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. పరిమితిని మించితే రేటు చెల్లించాల్సి ఉంటుందని గత ఏడాదే గూగుల్‌ తెలియజేసింది.

గూగుల్‌ ఫొటోస్‌

గూగుల్‌ కొత్త స్టోరేజ్‌ పాలసీ జూన్‌ 1 నుంచి అమలుకానుంది. ఇక నుంచి ఫొటోలు, డాక్యుమెంట్లు సహా వేటినైనా 15 జీబీ  మేరకు మాత్రమే స్టోర్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.  పరిమితిని మించితే రేటు చెల్లించాల్సి ఉంటుందని గత ఏడాదే గూగుల్‌ తెలియజేసింది. టారిఫ్‌ రేట్లను సైతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేటు పడకుండా ఉండాలంటే నిబంధనలను అనుసరిస్తూ ఏమి చేయాలో చూద్దాం. 


ఫ్రీ స్టోరేజ్‌కి జూన్‌ 1నే చెల్లుచీటీ

  • హైరిజల్యూషన్‌ ఉన్న ఫొటోలను ఉంచుకునేందుకు పరిమితి అంటూ ఏమీ లేదు. అంటే నిర్దేశిత గడువు లోపు హై రిజల్యూషన్‌ ఉన్న ఫొటోలను ఎన్నింటినైనా  అందులోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
  • రెండు వెర్షన్‌లలో బ్యాకప్‌ ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని గూగుల్‌ కల్పిస్తోంది. హైక్వాలిటీ, ఒరిజినల్‌ క్వాలిటీ పేరిట ఈ రెండూ ఉంటాయి. 16 ఎంబీకి మించి ఉన్న ఫొటోలు పరిమితిని ఆ మేరకు సైజ్‌ తగ్గించుకునే  సదుపాయం గూగుల్‌లో ఉంది. 15జీబీ పరిమితిలో హైక్వాలిటీ ఫొటోలను లెక్కలోకి తీసుకోరు. దరిమిలా ఒరిజినల్‌ క్వాలిటీ ఫొటోలను హైక్వాలిటీ ఫొటోలుగా మార్చుకునేందుకు ఇదే మంచి సమయం. 
  • డూప్లికేట్‌, బ్లర్డ్‌ ఫొటోలతో ఎవ్వరికీ అవసరం ఉండదు. తక్షణం వాటిని అక్కడి నుంచి తొలగించడం శ్రేయస్కరం. అలాగే స్ర్కీన్‌షాట్‌లు అప్పటికప్పుడు అవసరం కోసం తీసుకునేవి. అలాంటి వాటిని కూడా తొలగించుకోవడం బెటర్‌. 
  • పాలసీ అమలైన తరవాత మాత్రం హైక్వాలిటీ ఫొటోలు కూడా లెక్కలోకి వస్తాయి. అందువల్ల అనుచితం అనిపించిన ఫైల్స్‌ అన్నింటినీ జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌ రెంటినుంచీ తీసేయాలి. 
  •  మరీ ముఖ్యమైన ఫైల్స్‌ అధికంగా ఉంటే మరొక జీమెయిల్‌ అకౌంట్‌ను ఆరంభించుకోవడం మంచిది. ఫొటోల బ్యాకప్‌ కోసం దానిని ఉపయోగించుకోవచ్చు. అలా మొదటి అకౌంట్‌పై ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. అయితే, కొత్త అకౌంట్‌లో కూడా 15 జీబీ పరిమితి దాటిపోకుండా చూసుకున్నప్పుడు మాత్రమే ఈ వెసులుబాటు ఉపయోగపడుతుంది. 
  • ఈ మధ్యకాలంలో వచ్చే ఫోన్లలో స్టోరేజీ పరిమితి 256 జీబీ, 512 జీబీ వరకు కూడా ఉంటోంది. కొన్ని ఫొటోలను అందులోకి పంపుకోవచ్చు. గూగుల్‌ ఫొటోస్‌పై ఆధారపడకుండా, స్మార్ట్‌ ఫోన్‌లోనే కొన్నింటిని ఉంచుకుంటే ఆ మేరకు ఉపయోగం పొందవచ్చు. 
  • యాపిల్‌ ఐ ఫోన్‌ వినియోగదారులకు క్లౌడ్‌ సదుపాయం ఉంది. ఫొటోలను అందులో ఉంచుకోవచ్చు. యాపిల్‌ వన్‌ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకుంటే అదనంగా ఐక్లౌడ్‌ స్టోరేజీకి అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.75 అద్దె చెల్లిస్తే 50జీబీ సదుపాయం ఉంటుంది.


Updated Date - 2021-05-29T08:33:46+05:30 IST