గూగుల్‌ ప్లే స్టోర్‌లో మిత్రో మళ్లీ లభ్యం

ABN , First Publish Date - 2020-06-06T07:54:57+05:30 IST

మిత్రో యాప్‌ మళ్లీ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది.

గూగుల్‌ ప్లే స్టోర్‌లో మిత్రో మళ్లీ లభ్యం

న్యూఢిల్లీ, జూన్‌ 5: మిత్రో యాప్‌ మళ్లీ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. స్పామ్‌, కనీస నిబంధనలను ఉల్లంఘించిందంటూ టిక్‌టాక్‌ తరహా మిత్రో యాప్‌ను గూగుల్‌ ఈ నెల 2న ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే, సమస్యలను పరిష్కరించడంతో మిత్రోను ప్లే స్టోర్‌లో మళ్లీ అందుబాటులోకి తెచ్చామని గూగుల్‌ తెలిపింది.  కానీ, ఏ నిబంధనలైతే ఉల్లంఘించారని గూగుల్‌ చెబుతోందో వాటిని సరిచేశారో లేదో అనే విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు.  

Updated Date - 2020-06-06T07:54:57+05:30 IST