లాక్ డౌన్: ఇళ్లకే పరిమితమైన మనోళ్లు గూగుల్‌లో వెతుకుతోంది ఇదే!

ABN , First Publish Date - 2020-04-08T03:20:59+05:30 IST

గూగుల్ ట్రెండ్స్‌... ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తోంది. అందరూ తరచూ వెతికే.. రెసీపీ, హెల్త్, లూడో వంటి పదాల ద్వారా చేసిన సెర్చిలను పరిశీలిస్తే.. మనోళ్లు కొత్త వంటకాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్: ఇళ్లకే పరిమితమైన మనోళ్లు గూగుల్‌లో వెతుకుతోంది ఇదే!

న్యూఢిల్లీ: అత్యవసర సిబ్బంది మినహా భారతీయులు అందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే ఇంటర్నెట్ పుణ్యమా అని రోజులు మరీ అంత భారంగా ఏమీ గడవట్లేదు. అంతర్జాలంలో సినిమాలు, సీరియళ్లు చూస్తూ గడిపేస్తున్నారు. ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లతో టైం పాస్ చేస్తున్నారు. ఇక కావాల్సినవి వెతికి ఇచ్చేందుకు గూగుల్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరి లాక్ డౌన్ కాలంలో ప్రజలు దేని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. అయితే గూగుల్ ట్రెండ్స్‌... ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తోంది. అందరూ తరచూ వెతికే.. రెసీపీ, హెల్త్, లూడో వంటి పదాల ద్వారా చేసిన సెర్చిలను పరిశీలిస్తే.. మనోళ్లు కొత్త వంటకాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నెట్‌‌ఫ్లిక్స్, ఆరోగ్య సంబంధిత విషయాలు, శృంగారం టిప్స్, లూడో ఆట వంటివి భారతతీయులను ఆకట్టుకుంటున్న విషయాల జాబితాలో తరువాతి స్థానాల్లో నిలిచాయి. 

Updated Date - 2020-04-08T03:20:59+05:30 IST