Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 14 2020 @ 12:32PM

బాలయ్య చేత ఆ సీన్ చేయించకుండా ఉండాల్సింది: బి.గోపాల్

నటరత్న నందమూరి బాలకృష్ణ, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్‌లో పలు సూపర్‌హిట్ సినిమాలు తెరకెక్కాయి. `లారీ డ్రైవర్`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను వీరు అందించారు. అయితే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన `పల్నాటి బ్రహ్మనాయుడు` చిత్రం మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఫలితం పక్కనపెడితే, సినిమాలోని కొన్ని సీన్లు తీవ్ర విమర్శల పాలయ్యాయి. 


ముఖ్యంగా బాలకృష్ణ తొడ కొడితే కుర్చీ ముందుకు రావడం, ట్రైన్ వెనక్కి పోవడం వంటివి నవ్వులపాలయ్యాయి. ఆ సీన్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడారు. ``పల్నాటి బ్రహ్మనాయుడు` సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. ఆ సినిమాలో కొన్ని సీన్లు విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ సినిమాలో పెట్టకుండా ఉండాల్సింది. ఆ సీన్ గురించి ఇప్పటికీ నేను బాధపడుతుంటాను. ఆ సీన్ పెట్టి చాలా తప్పు చేశాననే ఫీలింగ్ నాకుంద`ని గోపాల్ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement