Jul 23 2021 @ 21:09PM

టీజర్ చూశా.. ఇంటెన్సింగ్‌గా ఉంది: గోపీచంద్ మలినేని

‘కొత్త టీమ్‌తో తెరకెక్కిస్తున్న ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు దర్వకుడు గోపీచంద్ మలినేని. గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జికె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై గౌతమ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డిజె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ వేడుకకు గెస్ట్‌గా హాజరైన దర్శకుడు గోపీచంద్ మలినేని టీజర్‌ని విడుదల చేశారు.


ట్రైలర్ విడుదల అనంతరం గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘ఒకరోజు వీళ్ళు నాకు ఫోన్ చేసి టీజర్ చూడమని చెప్పారు. నచ్చితేనే సపోర్ట్ చేయండి అన్నారు. టీజర్ చూశాక చాలా ఇంటెన్సింగ్‌గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీశాడంటే అతనిలో ఎంత తపన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ టీజర్ చూసి ఈ టీమ్‌ను అభినందించాలని అనుకున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. గౌతమ్‌కి దర్శకుడిగా మొదటి చిత్రమే అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నాకు దేవి ప్రసాద్ గారు చెప్పారు.. అయన ఒక దర్శకుడై ఉండి ప్రస్తుతం నటుడిగా చేస్తున్నారు. సినిమా చాలా అద్భుతంగా తీశాడని ఆయన చెప్పారంటే గౌతమ్ టాలెంట్ ఏమిటో అర్థం అవుతుంది. ఒక్క దర్శకత్వం మాత్రమే కాదు అటు హీరోగా కూడా చాలా ఇంటెన్స్‌తో నటించాడు. ఇక తెలుగమ్మాయిలు తక్కువవుతోన్న ఈ సమయంలో పూజిత హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కొత్త టీమ్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.