గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయరు: చినరాజప్ప

ABN , First Publish Date - 2021-08-19T22:38:45+05:30 IST

గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయరు: చినరాజప్ప

గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయరు: చినరాజప్ప

తూర్పుగోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయరని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే చింతకాయల చినరాజప్ప తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేస్తానని గురువారం ఉదయం ప్రకటించారు. దీంతో బుచ్చయ్య చౌదరిని టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, జవహర్‌తో పాటు తదితర నాయకులు కలిశారు. టీడీపీని వీడొద్దంటూ సూచించారు. బుచ్చయ్యతో భేటీ అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ చంద్రబాబుతో గోరంట్ల మాట్లాడరని తెలిపారు. అందరూ కలిసి చంద్రబాబును కలుస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. 



Updated Date - 2021-08-19T22:38:45+05:30 IST