Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయనను రాత్రికి రాత్రే బదిలీ చేశారు: గోరంట్ల

రాజమండ్రి: తెలుగుదేశంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను రాత్రికి రాత్రే బదిలీ చేసి రాష్ట్రాన్ని సీఎం జగన్ సొంత జాగీరులా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయం వైసీపీ రాక్షస పాలన పతనానికి నాంది అని చెప్పారు. ప్రజల ఆగ్రహం నుంచి జగన్ తప్పించుకోలేరని హెచ్చరించారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులను జైలులోనే హత్య చేయించారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 

Advertisement
Advertisement