Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటి దొంగలను కాపాడేందుకు జగన్ కపటనాటకం: గోరంట్ల

రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి, ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహరించిన తీరు చూశామని, ఇంటి దొంగలను కాపాడేందుకు జగన్ కపటనాటకం ఆడారని ఆరోపించారు. డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోను వివేకాకు ఆస్తి తగాదాలు ఉండటం హత్యకు దారితీశాయన్నారు. జగన్ సమాజానికి చీడపురుగులా తయరయ్యారని, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదన్నారు. ఇసుక, ఎర్ర చందనం, గంజాయి మాఫియాలు జగన్ దగ్గర ఉంటారన్నారు. వివేకా హత్య కేసును పక్కదారి పట్టించిన ఎంపీ విజయసాయి రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము సీఎం జగన్‌కు ఉందా? అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement