Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఓటీఎ్‌సపై సందేహాలను నివృత్తి చేయాలి’

గొల్లప్రోలు, నవంబరు 30: గృహ నిర్మాణాల రుణాల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)పై లబ్ధిదారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఇద్దరు లబ్ధిదారులు కలిసి ఒకే ఇంటి కోసం రుణం తీసుకున్నారని, ఇద్దరి పేరున రిజిస్ట్రేషన్‌ చేస్తారా అని వారు ప్రశ్నించారు. దీనిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరి పేరునా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పత్రాలు జారీ చేస్తామని మేనేజరు రామప్రసాద్‌ తెలిపారు. అనంతరం అజెండాలోని అంశాలను ఆమోదించారు. కేవలం 20 నిమిషాల్లో సమావేశం ముగిసింది. వైస్‌ చైర్‌పర్సన్లు తెడ్లపు అలేఖ్యరాణి, గంధం నాగేశ్వరరావు పాల్గొన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనరు లక్ష్మీపతిరావు ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం గమనార్హం. 

Advertisement
Advertisement