రహదారిపై గోతులు పూడ్చివేత

ABN , First Publish Date - 2022-01-23T06:24:39+05:30 IST

రహదారిపై గోతులు పూడ్చివేత

రహదారిపై గోతులు పూడ్చివేత
నాగవరప్పాడులో గోతులను పూడుస్తున్న సర్పంచ్‌ షేక్‌ పెదనాగూర్‌

ఉంగుటూరు, జనవరి 22 : గన్నవరం-ఉంగుటూరు ఆర్‌అండ్‌బీ రహదారిపై నాగవరప్పాడులో మలుపువద్ద ప్రమాదకరంగా ఏర్పడ్డ రెండు పెద్దగోతులు ఆమార్గంలో ప్రయాణించే వాహనదారుల పాలిట నరకప్రాయంగా మారాయి. ఈరోడ్డు దుస్థితిని వివరిస్తూ గత నెల 10వ తేదీన ఆంధ్రజ్యోతిలో అధ్వానంగా రహదారులు అనే శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి పాఠకులకు విదితమే.. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్ధులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురికావడం చూసి చలించిన సర్పంచ్‌ ఈ సమస్యను పరిష్కరించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాడు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి గమాళాలతో కంకర, రాళ్లు, మట్టిని మోసుకొచ్చి  గోతులను పూడ్చాడు. కంకర, రాళ్లు, మట్టి ఇచ్చి తన సంకల్పానికి తోడ్పాటునందించిన గ్రామస్ధుల సహకారానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-01-23T06:24:39+05:30 IST