అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-05-12T07:20:15+05:30 IST

మండలంలోని కేశనకుర్రు కరకట్ట రోడ్డు ద్వారా ఆటోలో రవాణా చేస్తున్న 672 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆదేశాల మేరకు కర్ఫ్యూ డ్యూటీలో ఉన్న ఐ.పోలవరం పోలీసు సిబ్బందికి వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్‌, ఐ.పోలవరం ఎస్‌ఐ ఎస్‌.రాము దాడి చేశారు.

అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టివేత

ఐ.పోలవరం, మే 11: మండలంలోని కేశనకుర్రు కరకట్ట రోడ్డు ద్వారా ఆటోలో రవాణా చేస్తున్న  672 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆదేశాల మేరకు కర్ఫ్యూ డ్యూటీలో ఉన్న ఐ.పోలవరం పోలీసు సిబ్బందికి వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్‌, ఐ.పోలవరం ఎస్‌ఐ ఎస్‌.రాము దాడి చేశారు. డ్రైవర్‌ ఆటో వదిలి పరారయ్యాడు. గోవా రాష్ట్రానికి చెందిన 14 బాక్సుల మద్యాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రాము చెప్పారు.

Updated Date - 2021-05-12T07:20:15+05:30 IST