2107 బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-06T06:27:01+05:30 IST

మండలంలోని గొట్లగట్టు గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2017 గోవా మద్యం బాటిళ్లను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

2107 బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం
ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న గోవా మద్యం



పరారీలో నిందితులు

ఇంటి యజమానిపై కేసు 

కొనకనమిట్ల, మే 5 : మండలంలోని గొట్లగట్టు గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2017 గోవా మద్యం బాటిళ్లను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీ కాగా,  ఇంటి యజమానిపై కేసు నమదు చేశారు. ఎస్‌ఈబీ ఎస్‌ఐ పి.రాజేంద్రప్రసాద్‌ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని గొట్లగట్టులో అక్రమంగా మద్యం నిల్వ చేసినట్లు ఎస్‌ఈబీ మార్కాపురం ఏసీకి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం గ్రామంలోని ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 2107 క్వార్టర్‌ బాటిళ్ల గోవా మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఈదాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రావ్‌, కానిస్టేబుళ్లు షేక్‌ బాజీ సయ్యద్‌, పి.వెంకటేశ్వర్లు, ఎస్‌.ఎన్‌. గురవయ్య, ఆర్‌. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-06T06:27:01+05:30 IST