ప్రభుత్వ పనితీరుపై విశ్వసనీయత పెరగాలి

ABN , First Publish Date - 2021-03-06T06:27:02+05:30 IST

ప్రభుత్వ పనితీరుపై విశ్వసనీయత పెంచేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే అర్జీలు సత్వరమే పరిష్కరించి వారి మన్ననలు అందుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) జి.లక్ష్మీశ అన్నారు.

ప్రభుత్వ పనితీరుపై విశ్వసనీయత పెరగాలి

  • జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ.. సచివాలయాల తనిఖీ

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 5: ప్రభుత్వ పనితీరుపై విశ్వసనీయత పెంచేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే అర్జీలు సత్వరమే పరిష్కరించి వారి మన్ననలు అందుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని వీరభద్రపురం, హరిపురం ప్రాంతాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యపాలన ప్రజల వద్దకే చేర్చేందుకు గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సిబ్బంది సక్రమంగా విధులకు హాజరవ్వాలన్నారు. వలంటీర్లు, కార్యదర్శులు అవినీతిరహిత పాలన అందించాలన్నారు. సచివాలయాలకు అందిన అర్జీలను వలంటీర్లు ఎప్పడికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా ఆయన కాతేరులోని ఇసుక ర్యాంపును తనిఖీ చేసి ఇసుక సరఫరా, డిమాండ్ల రికార్డులను తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వెంటనే నిర్మాణదారులకు ప్రాధాన్యతాక్రమంలో ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి, రూరల్‌ తహశీల్దార్‌ రియాజ్‌ హుస్సేన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:27:02+05:30 IST