గవర్నర్‌కు చేరిన కొత్త ఎమ్మెల్యేల జాబితా

ABN , First Publish Date - 2021-05-05T12:43:54+05:30 IST

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి జాబితా గవర్నర్‌ వద్దకు చేరింది. మంగళ వారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు రాజ్‌భవన్‌కు వెళ్లి

గవర్నర్‌కు చేరిన కొత్త ఎమ్మెల్యేల జాబితా


చెన్నై: ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి జాబితా గవర్నర్‌ వద్దకు చేరింది. మంగళ వారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు ఆ జాబితాను అందజేశారు. అదే విధంగా పార్టీలు పొందిన స్థానాలు, ఓట్ల శాతం తదితర పూర్తి వివరాలను అందించారు. అంతేగాక ఎన్నికలు జరిగిన తీరు, ఇతర లోటుపాట్ల గురించి కూడా సత్యప్రదసాహు గవర్నర్‌కు వివరించారు. ఎన్నికల నిర్వహణ పట్ల  గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఈసీని అభినందించినట్టు సమాచారం. ఈ సమావేశంలో గవర్నర్‌ కార్యదర్శి ఆనందరావ్‌ వి.పాటిల్‌, అదనపు సీఈవో వి.రాజారామన్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. 


మంత్రివర్గ ప్రమాణస్వీకారంపై చర్చ

శుక్రవారం రాజ్‌భవన్‌లో జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌, గవర్నర్‌ కార్యదర్శితో మంగళవారం సమావేశమయ్యారు. కొవిడ్‌ నిబంధన లు పాటించేలా తక్కువమందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఒక్కో మంత్రికి 5 నుంచి 8 పాస్‌లు మాత్రమే అందించాలని, మొత్తం 200 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించి నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో రాజ్‌భవన్‌ వద్ద ఏర్పాటు చేయాల్సిన పటిష్ట భద్రత గురించి కూడా ఉన్నతాధికారులు కూలంకషంగా చర్చించారు. 

Updated Date - 2021-05-05T12:43:54+05:30 IST