Abn logo
Sep 27 2021 @ 01:06AM

ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్‌ పరం

సిరిసిల్లలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

- సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


సిరిసిల్ల రూరల్‌, సెప్టెంబరు 26 : కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం ప్రైవేటీకకరణ పేరుతో  ప్రభుత్వ ఆస్తు లను కార్పొరేట్‌ శుక్తలకు అప్పగిస్తోందని, దీనిని వ్యతి రేకిస్తూ సోమవారం చేపట్టిన భారత్‌ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సిరిసిల్ల పట్టణంలోని గాజుల మల్లయ్య కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్య దర్శి పసుల మారుతి సంస్మరణ సభకు హాజరయ్యారు.  మారుతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.  అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దేశంలో రైల్వే స్టేషన్‌ల తోపాటు రైళ్లు, రైల్వేలైన్లు, విమానాశ్రాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారాలు, ప్రభుత్వ రంగ సం స్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడంతో సామాన్య ప్రజలపై భారం పడుతోందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు సరిపడా ఆస్పత్రులను ఏర్పాటు చేయలేదని అన్నారు.  ప్రజలతో ప్లేట్ల చప్పుళ్లు చేయించడం, దీపాలను ముట్టించడం వంటివాటితో కరోనా పోదన్నారు. కరోనా టీకా  తయా రీలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో టీకాల తయారీకి అనేక కంపేనీలు ఉండగా కేవలం వారికి దగ్గరగా ఉన్న రెండు కంపేనీలకు తయారీ ఆర్డ ర్లను ఇచ్చిందని అన్నారు.  దేశంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపరింగ్‌ చేస్తున్నట్లు, దీనిపై ప్రతి పక్షనాయకులు ఆందోళనలు చేసి సుప్రీం కోర్టుకు వెళ్లి నట్లు చెప్పారు.  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ దీనిపై ప్రధానిని అడిగినా ఎలాంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు, కరెంట్‌  బిల్లులను పెంచితే ఆందోళనలు చేస్తామన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమపథ కాలను ప్రవేశపెడుతున్నారన్నారు. దళిత బంఽధు పఽథ కాన్ని  రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు.   ఉపాఽ దిహామీ పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేయా లన్నారు.  రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు, కూర పాటి రమేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, శాంతి ప్రకాష్‌ శుక్లా, జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్‌, మల్లారపు అరుణ్‌ కుమార్‌, ఎరవెళ్లి నాగరాజు, అన్నల్‌దాస్‌ గణేష్‌, జవ్వాజి విమల, ముక్తికాంత అశోక్‌, గురజాల శ్రీధర్‌, మిట్టపల్లి రాజమౌళి, రమేష్‌, శంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.