Abn logo
Aug 11 2020 @ 04:48AM

రైతుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతర కృషి

జన్నారం, ఆగస్టు 10: రైతు అభివృద్ధి కోసం  రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఖానా పూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. సోమవారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సీపతి బుచ్చయ్య ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జన్నారం మండలానికి మార్కెట్‌ కమిటీ ఏర్పాటైందని, మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా చైర్మన్లు పాటుపడాలన్నారు.


మార్కెట్‌ కమి టీ అభివృద్ధిపథంలో ఉంటే మండల రైతాంగానికి లాభం జరుగుతుందన్నా రు. చైర్మన్‌ సీపతి బుచ్చయ్య మా ట్లాడుతూ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా  నియమించినం దుకు ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కృత జ్ఞతలు తెలిపారు. వైస్‌చైర్మన్‌ సితి మల భరత్‌కుమార్‌తోపాటు సభ్యులు ప్రమాణస్వీ కారం చేశారు. జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, ఎంపీపీ మాదాడి సరో జన, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజారాం రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సతీష్‌, సుతారి వినయ్‌, మున్వర్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, జనార్దన్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement