Advertisement
Advertisement
Abn logo
Advertisement

రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్‌ సరఫరా జాప్యం వల్లే షేషెంట్లు మృతి చెందారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది పేషంట్లు చనిపోయారని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్‌ సరఫరా చేసే కంపెనీపై కేసు నమోదు చేశామని ప్రభుత్వం పేర్కొంది.


ఇటీవల రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కోవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని,  కోవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా  రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలని, రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని పిల్‌లో తెలిపారు. రుయా ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement