దళితబంధు అమలుపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు: కొప్పుల

ABN , First Publish Date - 2022-01-22T21:34:44+05:30 IST

దళితబంధు అమలుపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

దళితబంధు అమలుపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు: కొప్పుల

హైదరాబాద్‌: దళితబంధు అమలుపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1200 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే  రూ.100 కోట్లు విడుదల చేశామని, విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేస్తామని ప్రకటించారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షల నుంచి రూ.10 వేలతో ప్రత్యేక దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.

Updated Date - 2022-01-22T21:34:44+05:30 IST