జిల్లాల పునర్విభజన పేరిట ప్రభుత్వం డ్రామా

ABN , First Publish Date - 2022-01-28T05:15:24+05:30 IST

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పేరిట ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు భయపడి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ప్రకటన జారిచేయడం శోచనీయమన్నారు.

జిల్లాల పునర్విభజన పేరిట ప్రభుత్వం డ్రామా
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌

టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ 


గాజువాక, జనవరి 27: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పేరిట  ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు భయపడి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ  ప్రకటన జారిచేయడం శోచనీయమన్నారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించి,  ఇప్పుడు మూడు ముక్కలు చేసి జిల్లాకు ఉన్న ప్రాధన్యతను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు గోమాడ వాసు, నమ్మి సింహాద్రి, శ్రీనివాసరావు, వర్మ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:15:24+05:30 IST