పేదల రక్తాన్ని తాగే ప్రభుత్వమిది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-28T22:23:01+05:30 IST

పేదల రక్తాన్ని తాగే ప్రభుత్వమిది అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్‌ జలగ మాదిరిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వం ప్రతి కార్యక్రమం అవినీతి కోసం

పేదల రక్తాన్ని తాగే ప్రభుత్వమిది: చంద్రబాబు

గుంటూరు: పేదల రక్తాన్ని తాగే ప్రభుత్వమిది అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్‌ జలగ మాదిరిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వం ప్రతి కార్యక్రమం అవినీతి కోసం డిజైన్‌ చేస్తోందని ఆరోపించారు. మద్యపానం నిషేధం అంటూ కొత్త బ్రాండ్లు ఎందుకు తెచ్చారని, తమకు ఇష్టమైన మద్యం బ్రాండ్లనే జగన్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడాలేని మద్యం బ్రాండ్లు తెచ్చారని, మద్యం ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచారని, మద్యం ధరలు పెంచితే జే ట్యాక్స్‌ పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. 


‘‘ఇసుకపై జగన్‌ ప్రభుత్వ విధానంతో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మైన్స్‌ను మొత్తం తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆవా భూములను కొట్టేయాలని కుట్ర చేశారు. పంపకాల విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ గొడవతో విషయం బయటకొచ్చింది. మచిలీపట్నంలో ల్యాండ్‌ లెవలింగ్‌ పేరుతో వందల కోట్లు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలోనూ అవినీతి జరుగుతోంది. ప్రాజెక్టుల రీటెండరింగ్‌ అంటూ అవినీతికి పాల్పడ్డారు. పీపీఏల విషయంలోనూ బ్లాక్‌మెయిలింగ్‌ చేశారు. జగన్‌ నిర్వాకం వల్లే విద్యుత్‌లో కేంద్రం కొత్త సంస్కరణలు చేస్తోంది. బిల్డ్‌ ఏపీ కాదు... సోల్డ్‌ ఏపీగా మార్చబోతున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2020-05-28T22:23:01+05:30 IST