మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-10-28T04:11:51+05:30 IST

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
బూరుకుంటలో చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే యాదయ్య

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 


మొయినాబాద్‌ రూరల్‌: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం  అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. బుధవారం హిమాయత్‌నగర్‌ బూరుకుంటలో మత్స్యకారులతో చేపపిల్లలను వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారన్నారు. గొల్లకురుమలకు గొర్లు, ముదిరాజ్‌లకు చేపపిల్లల పంపిణీతో ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నారని తెలిపారు. చిలుకూరు చెరువులోనూ యాదయ్య చేపపిల్లలను వదిలారు. ఎంపీపీ నక్షత్రంజయవంత్‌, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, సర్పంచ్‌లు మంజులరవియాదవ్‌, స్వరూపఆండ్రూస్‌, రవళి, రత్నం, సొసైటీ వైస్‌చైర్మన్‌ మహేందర్‌, మత్స్యకార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, కొత్త నర్సింహారెడ్డి, రాజు, రాంచందర్‌, యాదగిరి పాల్గొన్నారు.

రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

గ్రామాలను అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. హిమాయత్‌నగర్‌లో ఆర్‌ఎండ్‌బీ సీసీ రోడ్డు పనుల్లో భాగంగా చేపట్టిన కల్వర్టు పనులను ఆయన పరిశీలించారు. నీటి పైప్‌లైన్‌ డ్రెయిన్ల పక్కనే వేస్తున్నారని, దీంతో కల్వర్టు నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని సర్పంచ్‌ మంజులరవియాదవ్‌ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇబ్బందులు రాకుండా కల్వర్టు పనులు చేయాలని, మెయిన్‌ పైప్‌లైన్‌ పాడవకుండా అధికారులు జాగ్రత్తతో పనులను చేయించాలని సూచించారు. జిల్లా మిషన్‌ భగీరథ ఏఈ సాయిబాబు, ఏఈఈ గంగ, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్‌, నరే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:11:51+05:30 IST