అమరావతి: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌రెడ్డి అన్నివర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌ను సంక్షేమ పథకాలకు మళ్లించడం శోచనీయమన్నారు. సీపీఎస్ రద్దుపై చిత్తశుద్ధి లేక కమిటీల పేరుతో కుంటిసాకులు చెపుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ చర్యలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని బుద్దా నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు.