వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-06-17T05:30:00+05:30 IST

వ్యాక్సిన్‌ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ ఆరోపించారు.

వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న కోట్ని బాలాజీ

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ

తుమ్మపాల, జూన్‌ 17:
వ్యాక్సిన్‌ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ ఆరోపించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో  పోల్చితే వ్యాక్సిన్‌ వేసుకున్న వారి సంఖ్య ఏపీలో తక్కువేనన్నారు. ఢిల్లీలో మొదటి డోసు వేసుకున్న వారి సంఖ్య 25 శాతం, గుజరాత్‌లో 24 శాతం, కర్ణాటకలో 20 శాతం కాగా, ఏపీలో మాత్రం 16 శాతమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్ల మొదటి డోసు వేసుకున్న వారికి రెండో డోసు అందడం లేదన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సైతం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందించకపోవడం ప్రభుత్వ వైఫలం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో వ్యాక్సిన్‌ కోసం నామామాత్రపు కేటాయింపులు చేయడం అన్యాయమన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో కేంద్ర మార్గదర్శకాలను పక్కన పెట్టి సొంత నిబంధనలను అమలు చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. ఆయన వెంట టీడీపీ నేత విజయ్‌ ఉన్నారు.

Updated Date - 2021-06-17T05:30:00+05:30 IST