అత్యాచార బాధితురాలికి చెల్లని చెక్కుతో ప్రభుత్వం మోసం

ABN , First Publish Date - 2021-07-01T00:32:03+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం

అత్యాచార బాధితురాలికి చెల్లని చెక్కుతో ప్రభుత్వం మోసం

అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిందని  భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లినేని నిర్మలా కిషోర్ ఆరోపించారు. అత్యాచారం కేసులో నిందితులను ఇంత వరకు అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరగడం శోచనీయమని ఆమె అన్నారు.


 రాష్ట్రానికి మహిళా హెూం మంత్రి ఉన్నా మహిళలపై అత్యాచార ఘటనలు పెరుగుతూ ఉండటం పోలీసుల అసమర్థతకు నిదర్శనమన్నారు. నిన్న తాడేపల్లిలో ప్రేమించలేదని ఒక అమాయకురాలిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో 455 అత్యాచార ఘటనలు జరిగినా వాటిని అరికట్టేందుకు ప్రయత్నించడం లేదని  నిర్మలా ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు పరిష్కరించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలికి చెల్లని చెక్కునిచ్చి ప్రభుత్వం కూడా మోసం చేసిందని నిర్మలా కిషోర్  ఆరోపించారు. 

Updated Date - 2021-07-01T00:32:03+05:30 IST