ప్రభుత్వ నిధులు వృథా కాకూడదు

ABN , First Publish Date - 2021-10-24T05:06:32+05:30 IST

విద్యాశాఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం ఉపయోగిస్తున్న నిధులలో ఏ ఒక్క రూపాయి కూడా వృథా కాకూడదని పాఠశాల ప్రాంతీయ సంచాలకులు ఎం.వెంకటకృష్ణారెడ్డి ఆదేశించారు.

ప్రభుత్వ నిధులు వృథా కాకూడదు
మాట్లాడుతున్న ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి

ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి 

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 23 : విద్యాశాఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం ఉపయోగిస్తున్న నిధులలో ఏ ఒక్క రూపాయి కూడా వృథా కాకూడదని పాఠశాల ప్రాంతీయ సంచాలకులు ఎం.వెంకటకృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో పి.శైలజ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు ఒక్కరోజు సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నవంబరు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాలకు అవసరమైన తరగతి గదుల వివరాలను కచ్చితంగా పంపించాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించి వివరాలను పంపాలని తెలిపారు. డీఈవో శైలజ మాట్లాడుతూ మండల విద్యాశాఖాధికారులకు కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు సహకరించాలని ఆదేశించారు.

సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతనంగా చేరిన విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరాయని త్వరలో పాఠశాలకు, విద్యార్థులకు చేరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు, రాయచోటి ఉప విద్యాశాఖాధికారులు నాగరాజు, రాజేంద్రప్రసాద్‌, మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు పాళెం నారాయణ, డీఈవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:06:32+05:30 IST