ప్రభుత్వ కొలువులకు గ్రంథాలయం బాసట

ABN , First Publish Date - 2020-08-12T10:13:55+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో జిల్లా గ్రంథాలయం నిరుద్యోగులకు బాసటగా నిలుస్తోందని గ్రంథాలయ చైర్మన్‌ రేణి కుంట్ల ప్రవీణ్‌ అన్నారు.

ప్రభుత్వ కొలువులకు గ్రంథాలయం బాసట

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 11 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో జిల్లా గ్రంథాలయం నిరుద్యోగులకు బాసటగా నిలుస్తోందని గ్రంథాలయ చైర్మన్‌ రేణి కుంట్ల ప్రవీణ్‌ అన్నారు. మంగళవారం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు నిరుద్యోగులకు పోటీ పరీక్షల నిర్వహణ ద్వారా శిక్షణ ఇస్తూ ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దామన్నారు.


జిల్లాలో సరైన కోచింగ్‌ సెంటర్‌ లేకపోవ డంతో ఈ ప్రాంత నిరుద్యోగులు వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ వెళ్ళేవారని, పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉద్యోగా వకాశాలు కోల్పోతున్నారన్నారు. నిరుద్యోగులకు తమవంతు  సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 91 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఈ సందర్భంగా సన్మానించారు. 

Updated Date - 2020-08-12T10:13:55+05:30 IST