మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2021-07-24T06:22:26+05:30 IST

మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్ర భుత్వం అనేక రకాల చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్‌ నా గలక్ష్మిసెల్వరాజన పేర్కొన్నారు.

మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

:  కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

నార్పల,జూలై23 : మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్ర భుత్వం అనేక రకాల చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్‌ నా గలక్ష్మిసెల్వరాజన పేర్కొన్నారు. నార్పల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయంలో శుక్రవారం దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ ప్రత్యేకత, అప్లికేషన డౌనలోడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే జొ న్నలగడ్డ పద్మావతి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, జేసీ సిరి పా ల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభు త్వం 2020లో దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇందులో భా గంగా పోలీస్‌స్టేషనలను, పెట్రోలింగ్‌ వాహనాలను, ప్రత్యేక ఇన్వె స్టిగేషన టీమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. దిశ యాప్‌ను మహి ళలు, వారి కుటుంబసభ్యులెవరైనా డౌనలోడ్‌ చేసుకోవచ్చన్నారు. మహిళలు ఎప్పుడైనా ఇబ్బందులు పడితే ఆ యాప్‌ను ఉపయో గించాలన్నారు. అలాగే వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు.  ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడు తూ... ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి దిశ యాప్‌ను మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ... మహిళ లు ఏ సమస్యనైనా ఈ యాప్‌ ద్వారా తెలియజేవచ్చన్నారు. జి ల్లాలో 3.50లక్షల మంది దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకున్నార న్నారు. పోలీస్‌స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. జేసీ సిరి మాట్లాడుతూ... దిశ యాప్‌ను అందరూ డౌనలోడ్‌ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటి మంది దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకునేలా లక్ష్యం నిర్ణయించారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, డీఎస్పీ వీరరా ఘవరెడ్డి, సర్పంచ సుప్రియ పాల్గొన్నారు. 

గ్రామ సచివాలయం ద్వారా 

నాణ్యమైన సేవలు అందించాలి

గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, సచివాలయానికి వచ్చే సేవ లకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించా లని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన సచివాల య ఉద్యోగులను ఆదేశించారు. ఆమె శుక్రవారం నార్పల లోని  గ్రామ సచివాలయం-4ను తనిఖీ చేశారు. స చివాలయం ద్వారా అందిస్తున్న అన్ని రకాల సేవల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. సచివాల యానికి వచ్చే సర్వీసులను ఎలాంటి పెండింగ్‌లో ఉంచరాదని, గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఉద్యోగులు ప్రతి రోజూ సచివాలయానికి హాజరుకావాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా ప్రదర్శించాలన్నారు. ఫీ వర్‌సర్వేను పూర్తిచేసి కరోనా అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించాల న్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమంది దిశయాప్‌ను డౌనలోడ్‌ చేసుకున్నారు?, ఎన్ని సర్వీసులు సచివాలయానికి వస్తున్నాయి? సాఫ్ట్‌వేర్‌ బాగా పనిచేస్తోందా తదితర వివరాలను ఎంపీడీఓ దివాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, పం చాయతీ కార్యదర్శి సాయుచరణ్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ శారద, మ హిళా పోలీస్‌ చంద్రకళావతి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T06:22:26+05:30 IST