Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ నుంచి తరలిపోతున్న మరో ప్రభుత్వ కార్యాలయం

అమరావతి: విజయవాడ నుంచి మరో ప్రభుత్వ కార్యాలయం తరలిపోతోంది. వెటర్నరీ, బయోలాజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను కడప జిల్లా పులివెందులకు తరలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ విజ్ఞప్తి మేరకు కంకిపాడులోని వీబీఆర్‌ఐని కడప జిల్లాకు తరలించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగులకు పులివెందులలో క్వార్టర్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంట్రోల్ రూంను విజయవాడ నుంచి విశాఖ తరలించాలని ప్రభు్త్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కంట్రోల్ రూం ఏర్పాటు కు కేటాయించిన రూ. 13.8 కోట్లను విశాఖకు బదలాయిస్తున్న ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండాల్సిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని 400 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడమంటే రాజధానిని విశాఖకు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదొక కీలక ఘట్టంగా స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అక్కడి సీసీ కెమెరాలు లేదా డ్రోన్ల ద్వారా వీడియో ఫుటేజ్‌ తీసుకుని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. అలాంటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అధికారులు ఉండే ప్రాంతంలో కాకుండా మరోచోట ఏ ప్రభుత్వమూ ఏర్పాటు చేయదు. అందుకు పోలీసు శాఖ కూడా సమ్మతి తెలపదు. గత ప్రభుత్వంలో ఈ సెంటర్‌ ఏర్పాటుకు విజయవాడలో స్థలం ఎంపిక చేసి రూ.13.80 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రదిపాదన అలా ఆగిపోయింది. తాజాగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విశాఖకు పరిపాలన రాజధానిని మార్చే ఆలోచనలో భాగంగా అంతే మొత్తంతో అక్కడ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement