ప్రభుత్వ కార్యాలయాలు కళకళ

ABN , First Publish Date - 2020-05-12T10:07:13+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందితో కళకళలాడుతున్నాయి. సోమవారం ఆయా కార్యాయాలకు పూర్తి స్థాయిలో సిబ్బంది

ప్రభుత్వ కార్యాలయాలు కళకళ

పెద్దపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందితో కళకళలాడుతున్నాయి. సోమవారం ఆయా కార్యాయాలకు పూర్తి స్థాయిలో సిబ్బంది హాజరై విధులు నిర్వహించడం ఆరంభించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివా రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఈ నేప థ్యంలో అత్యవసర విభాగాలు మినహా మిగతా విభాగాల కార్యాలయాలకు సిబ్బంది విడతల వారీగా 20 శాతం మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఆ మేరకు నెల రోజులుగా కార్యాలయాలన్నీ ఆ విధంగానే నడిచాయి. దీంతో ఆయా శాఖల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆదేశించడంతో అన్ని కార్యాలయాల సిబ్బంది హాజరయ్యారు. ఆయా కార్యాలయాలు చిన్నగా ఉండడంతో సిబ్బంది భౌతిక దూరం పాటించే పరిస్థితి లేకుండా పోయింది. 


బ్యాంకుల వద్ద జనం బారులు..

బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. పింఛన్ల సొమ్ము, నిత్యావసరాల సరుకుల కోసం ప్రభుత్వం జమ చేసిన సొమ్ము, ధాన్యం డబ్బుల కోసం వస్తున్న వారితో బ్యాంకులు రద్దీగా మారాయి. అయితే బ్యాంకుల ముందు భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో చాలా మంది మాస్కులు ధరించడం లేదు. 

Updated Date - 2020-05-12T10:07:13+05:30 IST