COVID-19 Vaccine: ఆగస్టు నాటికి తీరనున్న కరోనా వ్యాక్సిన్ల కొరత... రోజుకు 90 లక్షల టీకాలకు అవకాశం!

ABN , First Publish Date - 2021-07-13T16:21:52+05:30 IST

దేశంలో జూన్ 21 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది.

COVID-19 Vaccine: ఆగస్టు నాటికి తీరనున్న కరోనా వ్యాక్సిన్ల కొరత... రోజుకు 90 లక్షల టీకాలకు అవకాశం!

న్యూఢిల్లీ: దేశంలో జూన్ 21 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 38 కోట్ల మందికి టీకాలు వేశారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకాలు వేసే కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. అయితే ఆగస్టు నుంచి వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం కానున్నదనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే నెల నుంచి మనదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అందుబాటులో ఉండనున్నాయి. ఫలితంగా రోజుకు 80 లక్షల నుంచి 90 లక్షల మందికి టీకాలు వేసేందుకు అవకాశం కలగనుంది. 


ఇప్పటికే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ మోతాదులో మాత్రమే నిల్వలు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో జూలైలో మొత్తం 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉన్నాయి. ఆగస్టు నాటికి ఈ వ్యాక్సిన్ల ఉత్సాదన మరింతగా పెరగనుంది. జైడస్ క్యాడిలా కరోనా వ్యాక్సన్ డోసులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దేశంలో వినియోగానికి సంబంధించి అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.

Updated Date - 2021-07-13T16:21:52+05:30 IST