రైతులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం : తోమర్ ప్రకటన

ABN , First Publish Date - 2021-02-25T00:38:58+05:30 IST

ఉద్యమిస్తున్న రైతులు తాము సూచించిన ప్రతిపాదనలకు ఓకే చెబితే.. వారితో చర్చించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని

రైతులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం : తోమర్ ప్రకటన

న్యూఢిల్లీ : ఉద్యమిస్తున్న రైతులు తాము సూచించిన ప్రతిపాదనలకు  ఓకే చెబితే.. వారితో చర్చించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రైతులతో చర్చలు జరిపేందుకు తాము సదా సిద్ధంగానే ఉంటామని, ప్రభుత్వం వద్ద ఆ సున్నితత్వం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ పథకం ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఓ సభలో పాల్గొన్నారు. అయితే ఈ పథకం చాలా మంది రైతులకు అందడం లేదని క్షేత్ర స్థాయి నుంచి ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రంపై వ్యతిరేకత కారణంగానో, నిర్లక్ష్యం కారణంగానో ఒకరికి చెందాల్సిన నిధులు మరొకరికి చెందుతున్నాయని, అలా జరగకుండా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు అందడం లేదని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దీంతో పాటు ఉద్యోగాలు కావాలని కూడా అడుగుతున్నారని, అనర్హులకు ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదని తెలిపారు. అయితే... అర్హులైన వారికి అందివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తోమర్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-02-25T00:38:58+05:30 IST