రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-01-18T06:02:01+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ విమరించారు.

రైతుల సంక్షేమం కోసమే  ప్రభుత్వ పథకాలు
జగిత్యాలలో లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌

- రైతు వ్యతిరేకిగా మారిన బీజేపీ 

- ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అగ్రికల్చర్‌, జనవరి 17: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ విమరించారు.  రైతు బాంధవునిగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌, సీఎం కేసీఆర్‌ ఉంటే, నల్ల చట్టాలు, కొనుగోలు కేంద్రాల ఎత్తివేతతో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయం ఆవరణలో వివిధ రకాల పంట రుణాల కింద మంజూరైన రూ.27.50లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, 24గంటల నిరంతర విద్యుత్‌, చెరువుల పూడికతీత, కాళేశ్వర ప్రాజెక్ట్‌ నిర్మాణం, గోదాంల నిర్మాణం లాంటి రైతు సంక్షేమ పఽథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ రైతుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, డీజిల్‌, పెట్రోల్‌ రేట్ల పెంపు, నల్ల చట్టాల రూపకల్పన, బియ్యం కొనుగోలు విషయంలో విముఖత ప్రదర్శిస్తూ రైతు వ్యతిరేకిగా, రాక్షసత్వం ప్రదర్శిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ప్రజలు ప్రభుత్వాల తీరును గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన రీతిలో గుణపాఠం చెపుతారని సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజలు, రైతులు ప్రతిపక్షాల అసంబద్ద వాదనను పరిగ ణలోకి తీసుకోకుండా వాస్తవాలను గమనించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లపుడూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  జగిత్యాల, కల్లెడ ప్యాక్స్‌ ఛైర్మెన్‌లు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు,  వైస్‌ ఛైర్మెన్‌ శీలం సురేంధర్‌, రైతు బంధు నాయకులు నక్కల రవీంధర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ బండారి విజయ్‌, డీఏవో సురేష్‌కుమార్‌, సీఈవో గాజెంగి వేణు, అసిస్టెంట్‌ సీఈవో రాజేష్‌, అకౌంటెంట్‌ సుమన్‌, మల్లేశం, అజయ్‌ గౌడ్‌, ప్యాక్స్‌ డైరెక్టర్‌లు లోకిని ఎల్లయ్య, పోచమల్లు, కౌన్సిలర్‌ పంబాల రాము తదితరులున్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, డీఏవో సురేష్‌కుమార్‌లను ప్యాక్స్‌ చైర్మెన్‌ మహిపాల్‌ రెడ్డి శాలువాతో సత్కరించారు.. 

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

జగిత్యాల టౌన్‌ : జగిత్యాల పట్టణంలోని లింగంపేట, బీట్‌బజార్‌, గణేష్‌నగర్‌, గాంధీనగర్‌, ఖిలాగడ్డ, సుతారిపేట, గంజ్‌ ఏరియాలో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 7.32 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.  కార్యక్రమంలో  వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్‌, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్‌ రావు, కౌన్సి లర్లు సమిండ్ల వాణి శ్రీనివాస్‌, సిరికొండ భారతి, పంబాల రాము, పిట్ట ధర్మరాజు, నాయకులు మోసిన్‌, ఖాధర్‌, దుమాల రాజ్‌ కుమార్‌, లక్ష్మణ్‌, రాజేష్‌ తదితరులు ఉన్నారు. అలాగే పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని శ్రీనివాస్‌ అనే అటో డ్రైవర్‌ శస్త్రచికిత్స కోసం మంజూరైన రూ. 1.50 లక్షల విలువగల ఎల్‌వోసీ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అందజేశారు.  

Updated Date - 2022-01-18T06:02:01+05:30 IST