Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలి

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

బల్లికురవ, డిసెంబరు 6:  ప్రభుత్వ పథకాలను పార్టీలకతీతంగా అ ర్హలందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదేనని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. బల్లికురవ మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ బడు గు శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది. హాజరైన కృష్ణచైతన్య మాట్లాడుతూ గృహ హక్కు పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శాఖల వారీ సమీక్షించారు. గ్రామాలలో తాగునీటి సమస్యలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల ఎన్యూమరేషన్‌ గురించి ఆరా తీశారు. తొలుత ఉప్పుమాగులూరు ఎంపీటీసీగా గెలుపొందిన ఒంటరి మరియమ్మ చేత అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. 

సమావేశం అనంతరం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసమావేశంలో ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చింతల పేరయ్య, జడ్పీటీసీ సభ్యురాలు చింతల అంజలి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ అశోక్‌వర్దన్‌,  ఏవో కుమారి, ఏపీవో శైలాజ, ఏపీఎం ప్రసాద్‌బాబు, గృహనిర్మాణ శాఖ డీఈ దాశరథిశర్మ, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు హనుమంతురావు, శివయ్య, సీడీపీవో ఝూన్సీ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలి

అద్దంకి, డిసెంబరు 6: కలవకూరులోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు. సోమవారం జరిగిన ఆలయ నూతన పాలక మండలి ప్రమా ణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చైర్మన్‌గా దాచేపల్లి ఆంజనేయులు, సభ్యులుగా బూదాటి శ్రీనివాసరావు, పల్లె వెంకటరెడ్డి, చలంచర్ల సుశీల, అలుగొండ్ల శ్రీనివాసరెడ్డిల చేత ఈవో కోటిరెడ్డి ప్ర మాణం చేయించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు యల గాల అంజలి, సర్పంచ్‌ తన్నీరు రమణ, పల్లె ఆదిరెడ్డి,  పోతిరెడ్డి వెంక టేశ్వరరెడ్డి, కొణిదెన వెంకటేశ్వరరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అవిశన ప్రభాక ర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement