Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘చలించరూ..!

ప్రభుత్వాసుపత్రుల్లోని రోగులు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు చలికి వణికి పోతున్నారు. రోగులు, విద్యార్థులకు చలికాలంలో పంపిణీ చేయాల్సిన దుప్పట్లు అందకపోవడంతో ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అడిగితే  ఛీత్కారాలు     చీదరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని మిన్నకుండిపోతున్నారు. కొందరు దుప్పట్లను ఇంటి నుంచి, మరికొందరు బయట మార్కెట్లో  కొనుగోలు చేసుకుంటున్నారు.  హాస్టళ్లలో శిథిలావస్థ భవనాల కిటికీలు, తలుపులు విరిగిపోవడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. 


నేటికీ పంపిణీ చేయని దుప్పట్లు  

ఇబ్బందుల్లో రోగులు, విద్యార్థులు

పట్టించుకోని అధికారులు

ఇదీ ప్రభుత్వాసుపత్రులు, సంక్షేమ హాస్టళ్లలోని దుస్థితి


హైదరాబాద్‌ సిటీ: పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. అయితే, ఆస్పత్రుల్లో ఇన్‌పేషంట్లు ర్రాతి వేళ కప్పుకునేందుకు దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.  చలి కాలం కావడంతో వణుకు తూ కాళ్లు ముడుచుకొని పడుకుంటున్నారు. 


ఆస్పత్రుల్లో అవస్థలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె, మధుమేహం రోగులు, జ్వరం, దగ్గు, దమ్ము, శ్వాసకోశ బాధితులు, ఆపరేషన్‌ చేయించుకున్న వారు, గర్భిణులు, బాలింతలకు దుప్పట్లు ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి దాదాపు అన్ని ఆస్పత్రుల్లో కనిపిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, చెస్ట్‌, నిలోఫర్‌, పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రుల్లో రోగులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. 


ఇన్‌ఫెక్షన్స్‌కు అపరిశుభ్రతే.. కారణం

ఇటు శిశువులకు, అటు బాలింతలకు దుప్పట్లు, బెడ్‌షీట్లు తాజాగా ఉండాలి. లేకుంటే ఇన్‌ఫెక్షన్స్‌, ఇతర సమస్యల తలెత్తే పరిస్థితి. గైనిక్‌ వార్డులో పడకలు శుభ్రంగా లేక శిశువులు తరుచూ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. కొన్నిసారు శ్వాసకోశకు దారితీస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. బాలింతలు కూడా జలుబు, దగ్గు లాంటివి ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

Advertisement
Advertisement