సింగరేణి ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం: సుమన్

ABN , First Publish Date - 2021-08-06T21:04:26+05:30 IST

సింగరేణి ఖాళీ స్థలాలను జీవో 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ తెలిపారు.

సింగరేణి ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం: సుమన్

హైదరాబాద్: సింగరేణి ఖాళీ స్థలాలను జీవో 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి వైద్య కళాశాలలో 25శాతం.. సింగరేణి కార్మిక కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరామని తెలిపారు. త్వరలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సింగరేణి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని సుమన్ తెలిపారు. మరోవైపు రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింనందుకు మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ చీఫ్‌ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చందర్, మెడికల్ కాలేజీలో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని కేటీఆర్‌ను కోరిన నేతలు


Updated Date - 2021-08-06T21:04:26+05:30 IST