కరోనా భయంతో.. మూగజీవాలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం!

ABN , First Publish Date - 2020-06-07T19:44:35+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా భయంతో పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా భయంతో.. మూగజీవాలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం!

ది హేగ్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా భయంతో పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దేశంలో మింక్‌లను వాటి వెంట్రుకల కోసం పెంచుతారు. వీటికి కరోనా సోకుతున్నట్లు ఇటీవలే తెలిసింది. అలాగే ఈ జీవుల ద్వారా మనుషులకు కరోనా సోకుతోందని గుర్తించిన ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం వీటిని హతమార్చాలని నిర్ణయించింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం రికార్డుల ప్రకారం మింక్‌ల ద్వారా ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకింది.

Updated Date - 2020-06-07T19:44:35+05:30 IST