Abn logo
May 22 2020 @ 04:53AM

ధాన్యం కొనుగోళ్లకు మంగళం..?

ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పుకోనున్న ప్రభుత్వం?  

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలతో సంకేతాలు

రైస్‌మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించనున్న ప్రభుత్వం  

మిల్లర్లు, వ్యాపారులకు పోటీగా కొన్ని కేంద్రాల నిర్వహణ


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): ‘పంట మార్కెట్‌లోకి రాగానే టకటకా అమ్ముడుపోవాలి.. ఎవరికి వారుగా ఇష్టం వచ్చిన పంట, ఇష్టం వచ్చిన పద్ధతిలో, ఇష్టం వచ్చిన రకాలను సాగుచేస్తే ఆ పంటకు డిమాండ్‌ రాదు.. అప్పుడు నష్టపో తాం.. ఇబ్బందులు పడతాం.. ధరలు రావు.. ఎవరు సాయం చేయరు.. ప్రభుత్వం ప్రతిసారి ధాన్యం కొనదు.. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. ఈసారి కరోనా ఉందని కొంటున్నాం.. ప్రతి ఏటా కొనలేం.. ప్రభుత్వం ఇంకా ఏ పని చేయలేదు. ధాన్యం కొనడానికి, అమ్మడానికే సరిపోతుం ది.. కొనుగోలు, అమ్మకాలు మార్కెట్‌ పని.. రైతుల పని.. అది ప్రభుత్వం పని కాదు..’ అని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లు, అధికారులు, మండల స్థాయి అధికారులు, రైతు సేవా సమితుల కో ఆర్డినేటర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్న మాటలివి.


దీనిని బట్టి చూస్తే వచ్చే సీజన్‌ నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పుకుంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రైతులు ఇక గతంలో వలే మార్కెట్‌ యార్డుల్లో గానీ, నేరుగా రైస్‌ మిల్లుల పాయిం ట్ల వద్దకు గానీ వెళ్లి, తమ వద్దకు వచ్చే మధ్య దళారులకు గానీ ధాన్యాన్ని విక్రయించుకునే పరిస్థితి తలెత్తనున్నదని అర్థమవుతు న్నది. ఇప్పటి నుంచే రైతులను మానసికంగా సంసిద్ధం చేసేందుకు సీఎం కేసీఆర్‌ తన మాటల ద్వారా ధాన్యం కొనడం ప్రభుత్వం పని కాదు అని చెప్పకనే చెప్పినట్లున్నది. పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం లెవీ విధానంలో మార్పులుచేర్పులు తీసుకరావడంతో ధాన్యం కొనుగోళ్ల భా రం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నది. పౌరసరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వాహకులకు కమీషన్లు ఇచ్చి ధాన్యం కొను గోలు చేస్తున్నది. ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)కు ఇచ్చి బియ్యం సేకరిస్తున్నది. మిల్లింగ్‌  చేసినం దుకు చా ర్జీలు చెల్లిస్తున్నది. క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం తీసు కుం టున్నది. ప్రభుత్వం వచ్చిన బియ్యాన్ని రేషన్‌ అవసరాలకు మిన హాయించుకుని మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీ కింద ఇస్తున్నది. 


గతంలో మిల్లర్ల ద్వారానే..

గతంలో కేంద్ర ప్రభుత్వం మిల్లర్ల ద్వారానే లెవీ కింద బియ్యం సేక రించేది. అప్పుడు మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని కొను గోలు చేసే వారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణ పెరిగిపోవడంతో లెవీ సేకరణ తగ్గించింది. దీంతో ప్రభుత్వం 2009 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. ఆ తర్వా త అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం రైస్‌మిల్లర్ల నుంచి లెవీ కింద బియ్యం సేకరణను పూర్తి గా నిలిపి వేయడంతో ధాన్యం కొనుగోళ్ల భారం రాష్ట్ర ప్రభు త్వాలపై పడింది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరగడం తో ప్రభుత్వానికి ధాన్యాన్ని కొ నుగోలు చేయడం సవాల్‌గా మారింది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట ధాన్యాన్ని కట్‌ చే యడం, డబ్బుల చెల్లింపుల్లో జా ప్యం, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు కాయడం వల్ల ప్రభుత్వా నికి ప్రతిపక్ష పార్టీల నుంచి ఇబ్బందిగా మారింది.


రైతులు కూడా అందరు వరి పంటనే సాగు చేయడం, అందులో అత్యధికంగా దొడ్డురకాలను సాగు చేస్తుండడంతో వారిని నియంత్రిం చేందుకు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకవస్తున్నది. అందులో భాగంగా వరి ధాన్యం కేంద్రాల నిర్వహణ నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి తెలు స్తున్నది. రైతులు అధికం గా వరిసాగు చేస్తే అందు కు సరిపడా రైస్‌మిల్లులు రాష్ట్రంలో లేవని, వరి సాగు విస్తీ ర్ణాన్ని తగ్గించి, సాగు చేసే పంటలో సగం వరకు సన్న రకాలను పెంచాలని చెబుతున్నది. దీంతో ధాన్యం కొనుగోళ్ల భారం తగ్గనున్నది. ధాన్యాన్ని కొను గోలు చేసే బాధ్యతను రైస్‌మిల్లర్లకు అప్పగించే అవకాశా లు కనబడుతున్నాయి. దీంతో గతంలో వలే రైతులే నేరుగా మిల్లుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని విక్రయించే పరిస్థితి రానున్నది. 


రైస్‌మిల్లర్లు నష్టపోకుండా..

రాష్ట్రంలో రైస్‌మిల్లర్లు నష్ట పోకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకవస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మిల్లర్లు కొనుగోలు చేసిన పంటను మర ఆడించిన తర్వాత వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసి రేషన్‌ అవసరాలకు పోను మిగిలిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీ కింద ఇవ్వనున్నది. ఈ విధానం వల్ల ప్రభు త్వానికి కొంత ఆర్థికభారం తప్పనున్నది. అటు.. మిల్లర్లకు లాభాలు చేకూరే అవకాశాలుంటాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే నిర్వాహకులకు క్వింటాలు ధాన్యానికి 2.5 రూపాయల కమీషన్‌, కస్టమ్‌ మిల్లింగ్‌ చార్జీలు, ధాన్యం రవాణా చార్జీలు, గన్నీ సంచుల కొనుగోళ్లు, హమాలీ చార్జీల చెల్లింపు, రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనబడుతున్నది. ప్రైవేట్‌ వ్యాపారులకు పోటీనిచ్చేందుకు కొన్ని కొనుగోలు కేంద్రాలను మాత్రం నడిపించే అవకాశా లున్నాయని తెలుస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ప్రభుత్వం తప్పుకుంటే మాత్రం రైతులు మరిన్ని ఇబ్బందుల పాలు కావాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement