కక్ష సాధింపులతో ప్రభుత్వం ఆటవిక పాలన

ABN , First Publish Date - 2021-01-21T06:03:35+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్ర భుత్వం కక్ష సాధింపులతో ఆటవిక పాలన సాగిస్తోందని పెద్దాపురం, రాజమహేంద్రవరం రూర ల్‌ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గో రంట్ల బుచ్చయ్య చౌదరిలు ధ్వజమెత్తారు.

కక్ష సాధింపులతో ప్రభుత్వం ఆటవిక పాలన

ఎమ్మెల్యేలు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి ధ్వజం 

అనపర్తి, జనవరి 20: రాష్ట్రంలో వైసీపీ ప్ర భుత్వం కక్ష సాధింపులతో ఆటవిక పాలన సాగిస్తోందని పెద్దాపురం, రాజమహేంద్రవరం రూర ల్‌ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ధ్వజమెత్తారు.  ఇటీ వల  మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి అ ల్లుడు తేతలి సత్తిరాజురెడ్డి మృతి చెందడంతో అనపర్తి మండలంలో రామవరం గ్రామంలో బుధవారం మూలారెడ్డి కుటుంబాన్ని వీరు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో చినరా జప్ప మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి అల్లుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి ఎంతో కాలంగా భార్యా బిడ్డలను వదలిపెట్టి వేరే ఆమెతో జీవనం సాగిస్తున్నాడని, ఆయన మృతికి వీరి కుటుంబం కారణమంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. చివరకు మృతదేహాన్ని ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించినా ఇవ్వకుండా పోలీసులు అన్యాయం చేశారన్నారు. సత్తిరాజు రెడ్డి సహజీవనం చేస్తున్న మహిళకు మృతదేహాన్ని అప్పగించడం దారుణమైన చర్య అని అన్నారు. అతని మృతికి కారకులను చేస్తూ మూలారెడ్డి కుటుంబంపైనా మృతుడి కుటుంబ సభ్యులపైనా అధికార పార్టీ ఒత్తిడి వల్లే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూ ర్యనారాయణరెడ్డి వేధింపులవల్లే తాను ఆత్మహ త్య చేసుకుంటున్నానని సూ సైడ్‌ నోట్‌ రాసి ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్నా పోలీసులు నోరుమెదపలేదని దీనిపై పోలీసు ఉన్నతాధికారులను తాము కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. రాజమహేంద్రవరంరూరల్‌ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అక్రమాలను వెలికి తీస్తున్న రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

రాజకీయ ప్రయోజనాల కోసమే అక్రమ కేసులు 

 మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి కుమార్తె విజయలక్ష్మి 

రాజకీయ ప్రయోజనాల కోసమే తమ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కుమార్తె విజయలక్ష్మి ఆరోపించారు. తన భర్త తేతలి సత్తిరాజురెడ్డి మరణం తరువాత జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తన భర్త సత్తిరాజురెడ్డి తాను కొన్ని విభేదాల కారణంగా విడిగా ఉంటున్నామని, ఇప్పటివరకు తాము విడాకులు తీసుకోలేదన్నారు. అయితే తన భర్త మృతిచెందిన తరువాత మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరామని అయినా తన భర్తతో సహజీవనం చేస్తున్న మరో మహిళకు మృతదేహాన్ని అప్పగించారని ఇది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అయితే తన భర్త మృతికి తన సోదరుడు రామకృష్ణారెడ్డి, మరదలు మహాలక్ష్మిలు కారణమంటూ పోలీసులు కేసునమోదు చేయడం సమంజసంకాదని ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆమె ఆరోపించారు.


Updated Date - 2021-01-21T06:03:35+05:30 IST