Abn logo
Jul 8 2020 @ 05:05AM

డబుల్‌ బెడ్‌రూం గృహాలు త్వరగా పూర్తి చేయాలి

 ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 


మందమర్రిటౌన్‌, జూలై 7 : డబుల్‌బెడ్‌రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ తెలిపారు. మంగళవారం తహసీల్దార్‌  కార్యాలయం సమీపంలో 34 ఎకరాల్లో నిర్మిస్తున్న 564 డబుల్‌బెడ్‌రూం పనులను జడ్పీ చైర్‌పర్స న్‌ భాగ్యలక్ష్మీఓదెలుతో కలిసి పరిశీలించారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విప్‌ మాట్లాడుతూ గత నెల తెలంగాణ ఆవిర్భావ దిన్సోతవం రో జున పంపిణీ చేయాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో పనులు నిలిచిపోయాయని తెలిపారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేసి జనవరిలో పంపిణీ చేసేలా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.  క్యాతనపల్లి, చెన్నూరులో గృహాలు పూర్తయితే నిరుపేదలకు మేలు జరుగుతుంద న్నారు. తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, కమిషనర్‌ రాజు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


పట్టణంలోని సీఈఆర్‌ క్లబ్‌ ఆవరణలో నియోజకవర్గానికి సంబంధించి 144 మంది రేషన్‌ డీలర్లకు మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి రూ. 24.88 లక్షల కమీషన్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ అందజేశారు. 


మందమర్రి పట్టణంలో వాకర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వినతిపత్రం అందజేశారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందు, శ్రీనివాస్‌లు మా ట్లాడుతూ స్థలం కేటాయిస్తే యోగా, వ్యాయామానికి వీలుగా ఉంటుందన్నారు. 

Advertisement
Advertisement