రాజురాలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే
కుభీర్, ఏప్రిల్ 8 : బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పార్డి(బి) గ్రామంలో రూ. 16లక్షలతో ప్రైమరి హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ, రాజురా గ్రామంలో 22 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. పల్సిలో గ్రామ పంచాయితీ నిధులు రూ. 10లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి పల్సిలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమ వీర వనిత చాకలిఐలమ్మ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతియే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అములు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలియజేశారు. విగ్రహావీష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజకసంఘం రాష్ట్ర నాయకులు సుంకెట పోశెట్టి, నాయ కులు తూంరాజేశ్వర్, శ్రీరాముల రాజేశ్, కొట్టే హన్మండ్లు, బీజేపీ జిల్లా అధ్యక్షు రాలు రమాదేవి, నాయకులు తాలోడ్ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ రజాకర్ల కాలం లో చాకలిఐలమ్మ చేసిన ఉద్యమాలను కొనియాడారు. మహిళలు ఆమె స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షురా లు తూం లక్ష్మీబాయి, పార్టీ(బి) సర్పంచ్ తూం పుష్పలత, జుమ్డా సర్పంచ్ మానేకర్ అర్చన సురేష్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, మాజీ జెడ్పీటీసీ శంకర్చౌహాన్ జేయి రాజేందర్రావు, తదితరులున్నారు.