‘సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం’

ABN , First Publish Date - 2020-12-05T05:55:29+05:30 IST

ఆదివాసీలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడందెబ్బ) జిల్లా అధ్యక్షుడు గొడం గణేష్‌ అన్నారు.

‘సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం’

ఆదిలాబాద్‌రూరల్‌, డిసెంబరు 4: ఆదివాసీలు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడందెబ్బ) జిల్లా అధ్యక్షుడు గొడం గణేష్‌ అన్నారు. శుక్రవారం రూరల్‌ మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టబద్ధత లేని లంబాడాలకు ఎస్టీ హోదాను రద్దు చేయాలన్నారు. ఆదివాసీలు సాగు చేస్తు న్న అటవీ భూములకు హక్కు పత్రాలను జారీ చేయాల న్నారు. జీవో ఎంఎస్‌ నెంబర్‌ 3ను యథావిధిగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వేను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సలాం జంగుపటేల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కుడ్మ యశ్వంత్‌, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శశరావ్‌, జిల్లా కార్యదర్శి మనోజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:55:29+05:30 IST