Abn logo
Oct 25 2021 @ 00:59AM

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి

సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి

చింతపల్లి, అక్టోబరు 24: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుర్మేడ్‌ గ్రామంలో ఆదివారం జరిగిన పార్టీ మ హాసభలో మాట్లాడారు. ఎన్నికల ముందు పేద ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యలను పూర్తిగా విస్మరించాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచిన ఘనత మోదీకే దక్కిందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం నాయకులు నారి ఐలయ్య, కంబాలపల్లి అనంద్‌, రాములు, సర్ధార్‌, యాద య్య, పెద్దయ్య, బాలయ్య, వీరబ్రహ్మం, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.