ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనాల్సిందే: అద్దంకి

ABN , First Publish Date - 2021-12-06T06:26:15+05:30 IST

రైతులు పండించిన ధన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కొనుగోలు చేయాల్సిందేదనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు.

ధాన్యాన్ని  ప్రభుత్వాలు కొనాల్సిందే: అద్దంకి
నూతనకల్‌లో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌

నూతన్‌కల్‌ డిసెంబరు 5: రైతులు పండించిన ధన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కొనుగోలు చేయాల్సిందేదనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. నూతనకల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.   ధాన్యం కనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసు కుంటూ రైతులను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పుష్క లంగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరగడంతో  తక్కువ పెట్టుబడితో రైతులు వరిని సాగు చేస్తున్నందున, ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేఽశారు. రాష్ట్రంలో రోడ్లు ఆధ్వానంగా మారాయ న్నారు. ఈ సమావేశంలో నాయకులు తీగల గిరిధర్‌రెడ్డి, కొంపెల్లి మల్లారెడ్డి, ఏనుగుతల సోమయ్య, పగిళ్ల అశోక్‌ రెడ్డి, దేవయ్య, ఉదయ్‌, తదితరులు ఉన్నారు



Updated Date - 2021-12-06T06:26:15+05:30 IST