దివ్యాంగులను ప్రభుత్వాలు ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-12-04T05:44:51+05:30 IST

దివ్యాంగులను ప్రభుత్వాలు ఆదుకోవాలి

దివ్యాంగులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
ఆమనగల్లు: దివ్యాంగులకు మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్న ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో వక్తలు 


షాద్‌నగర్‌/షాద్‌నగర్‌అర్బన్‌/ఆమనగల్లు/ఇబ్రహీంపట్నం/ కేశంపేట/యాచారం/శంషాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులను ఆదుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న భుజంగరెడ్డి డిమాండ్‌ చేశారు.  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ కొవిడ్‌-19 దివ్యాంగులను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, ఆహారం అందక జీవితాన్ని గడపలేని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దివ్యాంగులపై రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కోశాధికారి రాజశేఖరగౌడ్‌ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం ఆమోదం పొంది ఐదేండ్లు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. దివ్యాంగుల ప్రధాన కమిషనర్‌ కార్యాలయం ఏళ్ల తరబడి ఖాళీగా ఉందన్నారు. సిబ్బందిని నియమించకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదని తెలిపారు.  కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ యాదమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఈవో శంకర్‌ రాథోడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డిలు హాజరయ్యారు. ఉపాధ్యాయులు పుష్పలత, వెంకటేష్‌ పాల్గొన్నారు.అదేవిధంగా ఆమనగల్లు పీఆర్సీ భవనంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌లు మాట్లాడారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఉండి అన్ని రంగాల్లో రాణించాలని ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌లు అన్నారు. ఆమనగల్లు ఎమ్మార్సీ భవనంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  మండల విద్యాధికారి సర్దార్‌నాయక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము, పారా హ్యూమన్‌రైట్స్‌ క్లబ్‌ జిల్లా కమిటీ సభ్యుడు కొమ్ము తిరుపతి, చిగురు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ స్వప్నలు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లు, బిస్కెట్లు, హార్లిక్స్‌ను దివ్యాంగ విద్యార్థులకు అందజేశారు. వైస్‌ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, ఎంపీడీవో వెంకట్రాములు, సర్పంచులు బాల్‌రాజ్‌, లచ్చి, ఏఈ కృష్ణయ్య, భవిత సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ సుజాత, ఉపాధ్యాయులు శిరీష, రూప పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కోని రాజు కేక్‌ కట్‌చేశారు. దివ్యాంగులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అద్యక్షుడు భుజంగరెడ్డి, రాజశేఖర్‌గౌడ్‌, శివాజీ, కిరణ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలో ఇన్‌చార్జి ఎంఈవో మనోహర్‌ మానవ వనరుల భవనంలో దివ్యాంగ విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం రసూల్‌, ఉపాధ్యాయులు కృష్ణయ్య, పీడీ యాదయ్య, శ్రీనివా్‌సరావు పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలం నందివనపర్తిలో బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ బిలకంటి శేఖర్‌రెడ్డి దివ్యాంగులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు.  అనంతరం పలువురు దివ్యాంగులకు బస్‌పా్‌సలను అందజేశారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ ఉదయశ్రీ, హైదరాబాద్‌ డిపో మేనేజర్‌ రవీందర్‌నాయక్‌, ఇబ్రహీంపట్నం డిపోమేనేజర్‌ బాలునాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగుల  తల్లిదండ్రులకు సెన్స్‌టైజేషన్‌ పోగ్రాం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి హాజరయ్యారు. దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అర్హులైన వారికి  స్కాలర్‌షిప్పులతో పాటు వినికిడి యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దుద్యాల జయమ్మశ్రీనివాస్‌ జడ్పీటీసీ తన్వీరాజు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌ ఎంఈవో డి.రాంరెడ్డి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:44:51+05:30 IST