డ్రామాలు ఆడుతున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-11-27T07:01:32+05:30 IST

ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడు తున్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భూక్యపాండునాయక్‌ విమ ర్శించారు.

డ్రామాలు ఆడుతున్న ప్రభుత్వాలు
మఠంపల్లిలో తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఎం నాయకులు

 సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భూక్యపాండునాయక్‌ 

మఠంపల్లి, నవంబరు 26: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడు తున్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భూక్యపాండునాయక్‌ విమ ర్శించారు.  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో శుక్ర వారం  నిరసన తెలిపి మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలన్నారు. యాసంగిలో వరి సాగు చేయ వద్దనే మాటపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయలన్నారు. మద్దతు ధరతో  ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్‌ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రత్నవత్‌ వినోద్‌నాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, సుకృమియా పాల్గొన్నారు. 

వరి సాగుపై ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలి:  సీపీఎం

గరిడేపల్లి రూరల్‌: యాసంగి వరి సాగుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  మండలంలోని గానుగు బండ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మండల సీపీఐ కార్యకర్తల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కడియాల అప్పయ్య, పంగా గోవిందు, లింగయ్య, పాపయ్య, తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి: బీజేపీ

చిలుకూరు:  రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకుడు బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల నారా యణలు డిమాండ్‌ చేశారు. మండలంలోని నారాయణపురం, పాలెఅన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం  వారు పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వంగవీటి శ్రీనివాసరావు, మునగాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

రైతులను మోసం చేస్తే ఊరుకోం: టీఆర్‌ఎస్‌

పెన్‌పహాడ్‌: రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్‌ హెచ్చరించారు. మండల పరిధి లోని మాచారం, అనంతారం, పెన్‌పహాడ్‌, గడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం వారు పరిశీలించి మాట్లాడారు. ఐకేపీ ఆధ్వర్యంలో  మాచారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్ర మాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో కాంటా తూకా లను, తేమశాతం మిషన్లను తహసీల్దార్‌ శేషగిరిరావు, ఏవో కృష్ణసందీప్‌లు పరిశీలించారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తూముల ఇంద్రాసేనారావు,  మండల అధ్యక్షుడు పొదిల నాగార్జున, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్నా సీతారాంరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు గుర్రం అమృతారెడ్డి,  మామిడి అంజయ్య, మండల కో–ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

సూర్యాపేటరూరల్‌:  పండించిన ప్రతీ ధాన్యం గింజను  ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం అన్నారు. మండల పరిధిలోని రామారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల  మాటలు నమ్మొద్దన్నారు. ఈ  కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీనివాసనాయుడు, సర్పంచ్‌ బొల్లం సుమతీనాగరాజు, ఉపసర్పంచ్‌ మల్లేష్‌, ఉప్పు శ్రీను,వెంకన్న పాల్గొన్నారు.

నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: అదనపు కలెక్టర్‌

పెన్‌పహాడ్‌: నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  నిర్వాహ కులను అదనవు కలెక్టర్‌ మోహన్‌రావు ఆదేశించారు. పీఏసీఎస్‌ ఆధ్వ ర్యంలో పెన్‌పహాడ్‌ మండలం అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యం తేమ శాతం 17కంటే తక్కువ ఉండేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలను అఽధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.కొనుగోలు కేంద్రంలో సీసీ కెమెరాలు, ధాన్యం చోరీపై కొనుగోలు నిర్వాహకులు, ఎస్‌ఐ శ్రీకాం త్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్ర మంలో మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌, తహసీ ల్దార్‌ శేషగిరిరావు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాతాల జానకిరాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ మామిడి శ్రీనివాస్‌, సీఈవో సైదులు, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-11-27T07:01:32+05:30 IST