గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న బాలసదనం బాలికలు
సిద్దిపేట, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనాల్లోని పిల్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాల బాలికలందరూ బాగా చదువుకోవాలని సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా సిద్దిపేట బాలసదనంలోని చిన్నారులు బాలల హక్కులపై ఉపన్యసించారు. ఇంటరాక్షన్ పిల్లల యొక్క కేస్ స్టడీస్, సిద్దిపేటలోని బాలల పరిరక్షణ కమిటీ చేస్తున్న సేవలపై పాటలతో గవర్నర్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ దివ్య దేవరాజన్, సిద్దిపేట జిల్లా సంక్షేమ అధికారి రామ్‌గోపాల్ రెడ్డి, బాలరక్షా భవన్ కో ఆర్డినేటర్ మమత, డీసీపీవో రాము, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, పాల్గొన్నారు.