Governor‌ పేరుతో నకిలీ ఈమెయిల్స్‌

ABN , First Publish Date - 2021-10-18T15:18:15+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేరుతో కొందరు నకిలీ ఈమెయిల్స్‌, ట్విట్టర్‌ ఖాతాలను ప్రారంభించి అసభ్యమైన అభ్యంతరకరమైన సందేశాలు వెలువరిస్తున్నట్టు రాజ్‌భవన్‌ అధికారులు ఆదివారం సాయంత్రం

Governor‌ పేరుతో నకిలీ ఈమెయిల్స్‌

రాజ్‌భవన్‌ హెచ్చరిక

చెన్నై: రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేరుతో కొందరు నకిలీ ఈమెయిల్స్‌, ట్విట్టర్‌ ఖాతాలను ప్రారంభించి అసభ్యమైన అభ్యంతరకరమైన సందేశాలు వెలువరిస్తున్నట్టు రాజ్‌భవన్‌ అధికారులు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేశారు. ఈ నకిలీ ఈమెయిల్స్‌, ట్విట్టర్‌ గురించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ దుండగులను కనుగొనేం దుకు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నకిలీ ఈమెయిల్స్‌, ట్విట్టర్‌ సందేశాలు గురించి ప్రజలు పట్టించుకోరాదని తెలిపారు. రాజ్‌భవన్‌ అధికారిక ఈమెయిల్‌ govtam@nic.in అని, ట్విట్టర్‌ ఖాతా@rajbhavan_tnఅని అధికారులు ఆ ప్రకటనలో తెలియజేశారు.

Updated Date - 2021-10-18T15:18:15+05:30 IST