కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దేశం గర్వించదగ్గ సమయం-గవర్నర్‌

ABN , First Publish Date - 2021-01-16T21:26:41+05:30 IST

కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ వేస్తున్న ఈసమయం యావత్‌ దేశం గర్వించదగ్గదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దేశం గర్వించదగ్గ సమయం-గవర్నర్‌

హైదరాబాద్‌: కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ వేస్తున్న ఈసమయం యావత్‌ దేశం గర్వించదగ్గదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ వేయడమంటే కరోనా సమయంలో వారుచేసిన సేవలకు కృతజ్ఞత తెలియజేయడమేనని అన్నారు. ఎలాంటి స్వార్ధం లేకుండా వారు నిస్వార్ధంగా సేవలు అందించారని గుర్తుచేశారు. శనివారం గవర్నర్‌ దంపతులు నిమ్స్‌ను సందర్శించారు. ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించారు.


ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్‌తో ప్రపంచాన్ని హడలెత్తించిన మహమ్మారిని పారదోలడమేనని అన్నారు. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంతో దేశానికి రక్షణ కల్పిస్తున్నట్టేనని చెప్పారు. పోయిన ఏడాది నూతన సంవత్సరంలో వ్యాపించిన మహమ్మారిని ఈ సంవత్సరం తరమికొడుతున్న రోజుగా అభివర్ణించారు. ఈసందర్భంగా శాస్ర  ్త ్తవేత్తలను ప్రోత్సహించి వారికి మద్దతుగా నిలిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గవర్నర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను రక్షించడానికి వ్యాక్సిన్‌ తీసుకు రావడంలో శాస్త్రవేత్తల కృషికి ప్రధాని అండగా నిలిచారని కొనియాడారు.


స్వయంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ను సందర్శంచి శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ఎఫెక్టివ్‌ వ్యాక్సిన్‌ తీసుకు వచ్చేందుకు కృషి చేశారని అన్నారు. శాస్త్రవేత్తల కృషి వల్లనే మనం సొంత వ్యాక్సిన్‌ను తయారు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా మనం స్వంతంగా వ్యాక్సిన్‌ తయారుచేసుకోవడం గర్వించదగ్గ విషయమని గవర్నర్‌ ప్రశంసించారు. 

Updated Date - 2021-01-16T21:26:41+05:30 IST