దేశ రక్షణ దళాల్లోకి మహిళలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం: గవర్నర్

ABN , First Publish Date - 2021-11-26T00:46:53+05:30 IST

దేశ రక్షణ దళాల్లోనూ మహిళలు భాగస్వాములు కావడం మహిళలకు గర్వకారణమని రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

దేశ రక్షణ దళాల్లోకి మహిళలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం: గవర్నర్

హైదరాబాద్: దేశ రక్షణ దళాల్లోనూ మహిళలు భాగస్వాములు కావడం మహిళలకు గర్వకారణమని రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం రాజ్ భవన్ లో జాతీయ, అంతర్జాతీయ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఘనంగా జరిగాయి. శ్రీలంక, ఇండియాకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రతిభా పాటవాలను పదర్శించారు. సింగిడి ఆర్గనైజేషన్ భాషా, సాంస్క`తిక సంస్ధ ఆద్వర్యంలో రాజ్ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు దేశాల కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 


ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ ఈ ప్రదర్శనలు ఎంతో థ్రిల్లింగ్ గా వున్నాయని ప్రశంసించారు. రెండు దేశాల మహిళా కళాకారులు తమ నైపుణ్యాన్ని బాగా పదర్శించారని అన్నారు. ఎంతో మంది మహిళలు ధైర్యంగా దేశ సాయు దళాల్లో చేరడానికి ముందుకు వస్తున్నారని, ఇది దేశం పట్ల వారికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమవుతోందన్నారు. కళలను ఒక దేశం మరో దేశం ఇచ్చి పుచ్చుకునేలా మంచి సంబంధాలను పెంపొందించుకోవడం మంచి పరిణామమని అన్నారు. సాంస్క`తిక వైభవానికి ఇది పునాది వేస్తుందన్నారు. 

Updated Date - 2021-11-26T00:46:53+05:30 IST