రాజ్‌భవన్‌ పాఠశాలను సందర్శించిన గవర్నర్‌

ABN , First Publish Date - 2021-09-01T21:36:28+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో విద్యార్దులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారులను ఆదేశించారు.

రాజ్‌భవన్‌ పాఠశాలను సందర్శించిన గవర్నర్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో విద్యార్దులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి పాఠశాలలను పూర్తిగా ప్రతి రోజూ శానిటైజ్‌చేయాలన్నారు. బుధవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపధ్యంలో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ హైస్కూల్‌ను సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలల నిర్వాహకులు పిల్లల రక్షణకు తీసుకుంటున్నచర్యలను తెలుసుకున్నారు. అలాగే విద్యార్దులతో గవర్నర్‌ ముచ్చటించారు. విద్యార్దుల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాఠశాలల నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు మేనేజ్‌మెంట్ల కనీసం బాధ్యత అన్నారు. 


విద్యార్ధులకు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాద్యత తల్లిదండ్రులపై కూడా ఉందని ఆమె అన్నారు. పిల్లలు సరైన విధంగా మాస్క్‌లు ధరించేలా చూడాలన్నారు. సరైన విధంగా మాస్క్‌లు ధరించడం, తరచూ వాటిని వాష్‌ చేసుకోవాలన్నారు. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేలా, ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించేలా వారిని ప్రోత్సహించాలన్నారు. విద్యార్ధులు చాలా రోజుల తర్వాత తిరిగి పాఠశాలలకు రావడం సంతోషంగా వుందన్నారు. విద్యార్ధులు ఖచ్చితంగా రక్షణ పద్దతులుపాలటించేలా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, ఇంయన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సూచించిన నియమాలను మరికొంత కాలంగా ఖచ్చితంగా పాటించాలన్నారు. పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించడం కూడా వారి రక్షణకు చర్యలు తీసుకున్నట్లేనని గవర్నర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-01T21:36:28+05:30 IST